Jayam Jayam: తెలుగు చిత్ర పరిశ్రమ చెంతకు మళ్లీ ‘జయం.. జయం’

  • 17 ఏళ్లుగా భక్తి భావనలు నింపుతున్న ‘జయం జయం’ గ్రంథం
  • గతంలో ఈ గ్రంథంపై ప్రశంసలు కురిపించిన డాక్టర్ సినారె
  • తెలుగు సినీ పెద్దలకు సెంటిమెంట్‌
  • ఉచితంగా వితరణ చేసిన సినీ పెద్దలు
Puranapanda Srinivas Jayam Jayam Again In Tollywood

ప్రముఖ కవి పురాణపండ శ్రీనివాస్ రచించిన ‘జయం.. జయం’ పవిత్ర గ్రంథం మళ్లీ జంటనగరాల్లోని ఆలయాలకు చేరబోతోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హృదయాలను గెలుచుకున్న ఈ గ్రంథం ఎన్నోసార్లు పునర్ముద్రణ జరుపుకొంది. తాజాగా, ఈ గ్రంథం మరోమారు టాలీవుడ్ చెంతకు చేరబోతున్నది. పురాణపండ పుస్తకాలు కుల విభజన రేఖలకు అతీతంగా దేవుణ్ని ప్రేమించేలా చేస్తాయని పదిహేడేళ్ల క్రితం ప్రముఖ కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి. నారాయణరెడ్డి ప్రశంసించారు. మెగాస్టార్ చిరంజీవి కూడా పలుమార్లు ఈ పుస్తకం గురించి ప్రస్తావించారు. నాటి నుంచి ఈనాటి వరకు ఈ గ్రంథం భక్తుల హృదయాలను తాకుతూనే ఉంది. 

చాలామంది సినీ ప్రముఖులకు సెంటిమెంటుగా మారిన ఈ పుస్తకాన్ని ఇప్పుడు సరికొత్త విశేషాలతో చిత్ర పరిశ్రమకు ఉచితంగా ఇచ్చేందుకు రంగం సిద్దమైంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ద్వారా గతంలో ప్రముఖ నిర్మాత దిల్‌రాజ్ ఆఫీసు మేనేజర్ శేషగిరిరావు చాలామందికి ఈ పుస్తకాన్ని వితరణ చేసినట్టు ‘మా’ సిబ్బంది తెలిపారు. ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటి కూడా వందలకొద్దీ పుస్తకాలను ఇండస్ట్రీకి అందించారు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ ఆధ్యాత్మిక సాధనా గ్రంథం సినీ పరిశ్రమ చెంతకు చేరబోతోంది. 

More Telugu News